- ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీకి అప్లై చేసుకోవచ్చు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా అధికారిక వెబ్‌సైట్‌ను శుక్రవారం కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు. ప్రజలు ఇకపై https://hydraa.telangana.gov.in/ పోర్టల్ ద్వారా అన్ని వివరాలు తెలుసుకోవచ్చని రంగనాథ్స్పష్టం చేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వివరాల కోసం హెచ్ఎండీఏ లింక్ఇచ్చారు. అలాగే, భూ భారతి పోర్టల్ కూడా లింక్ అందుబాటులో ఉంచారు. హైడ్రా 24 గంటల అత్యవసర హెల్ప్‌లైన్ 1070ను పోర్టల్‌లో ప్రముఖంగా పొందుపరిచారు.
చెట్లు కూలడం, ఫైర్యాక్సిడెంట్లు, రోడ్లపై నీరు నిలవడం, వరదలు, సహాయక చర్యలు, ఇతర విపత్తుల సమయాల్లో ప్రజలు ఈ నంబర్‌కు కాల్చేయొచ్చు. లైవ్ రెయిన్ ఫాల్ మ్యాప్స్, రోజువారీ వర్షపాతం వివరాలు, వాతావరణ అంచనాలు, హైదరాబాద్ డాప్లర్ రాడార్ సమాచారం అందుబాటులో ఉంటుంది.
ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీ కోసం హైడ్రా పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు ఏ దశలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని కూడా పోర్టల్‌లో పొందుపరిచారు.
