వరంగల్ ట్రైసిటీలో గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

వరంగల్ ట్రైసిటీలో గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

 కాశీబుగ్గ, వెలుగు: వినాయక చవితి నిమజ్జనాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ట్రై సిటీ పరిధిలోమున్సిపల్​ కార్పొరేషన్​ విస్తృత ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి. భారీ విగ్రహాల నిమజ్జనం, లక్షలాది మంది భక్తుల రాక, ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇబ్బందులు, చెత్త పేరుకుపోవడం వంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకుని అధికారులు వివిధ విభాగాల సమన్వయంతో కార్యాచరణ రూపొందించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద క్రేన్లు, ఈతగాళ్లు, పడవలు, వైద్య శిబిరాలు, మొబైల్​టాయిలెట్లు, శానిటేషన్​ బృందాలను అందుబాటులో ఉంచనున్నారు. 

శుక్రవారం గ్రేటర్​ సిటీలోని చెరువుల నిమజ్జన ఏర్పాట్లను వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారద, చాహత్​ బాజ్​పాయ్​, సీపీ శ్వేత పరిశీలించారు. వారి వెంట సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ రవికుమార్, ఆర్డీవో వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో అప్పయ్య, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సామ్య నాయక్, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జీడబ్ల్యూఎంసీ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు పాల్గొన్నారు. 

అంతకుముందు హన్మకొండలోని కాళోజీ క్షేత్రంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీపీ శ్వేత మాట్లాడుతూ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోలీసులు, ప్రజల కలిసి పనిచేయాలన్నారు. వివిధ గ్రూపులకు చెందిన 1,000 సభ్యుల ద్వారా 1.60 లక్షల మంది సభ్యులకు డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ, వారి ద్వారా జిల్లాలోని ప్రతి కుటుంబానికి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యతిరేక సందేశాన్ని చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వహించామన్నారు.