‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశాడు. కలర్‌ఫుల్ విజువల్స్, ఫ్రెష్ టేకింగ్, యూత్‌ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది.
ఏగన్, శ్రీదేవి కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఫెమినా జార్జ్ ఎంట్రీ సర్‌ప్రైజ్‌గా ఉంది. సిద్ధు కుమార్ సంగీతం టీజర్‌కు మరింత రొమాంటిక్ ఫీల్‌ను తీసుకొచ్చింది. అక్టోబర్ 23న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అదిర్చి అరుణ్, మైమ్ గోపి, ‘సత్యం సుందరం’ ఫేమ్ ఇందుమతి, ‘లబ్బరు పందు’ ఫేమ్ జెన్సన్, ‘సిరాయ్’ ఫేమ్ ఇస్మత్ బాను, డాక్టర్ శివ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
