రాహుల్ ప్రధాని కావాలని పాదయాత్ర..కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన ఏపీ యువకుడు

రాహుల్ ప్రధాని కావాలని పాదయాత్ర..కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన ఏపీ యువకుడు
  • అభినందించిన పీసీసీ చీఫ్​

హైదరాబాద్, వెలుగు :  రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన ఏపీకి చెందిన కాటూరు వెంకటేశ్ ను టీపీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్ అభినందించారు. శుక్రవారం గాంధీభవన్​కు చేరుకున్న వెంకటేశ్​ను.. అసెంబ్లీలో ఉన్న పీసీసీ చీఫ్ అక్కడికి పిలిపించుకొని యాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. రాహుల్ పుట్టిన రోజైన జూన్ 19న ప్రారంభించిన ఈ పాదయాత్ర 85 రోజుల పాటు 1,530 కిలోమీటర్లు సాగిందన్నారు. ‘రాగా ఫర్ రేస్ ఆఫ్ ఇండియా' పేరుతో ఈ యాత్ర ప్రారంభించినట్లు వెంకటేశ్ 
చెప్పారు.