కుటుంబంతో కలిసి ప్రయాణించేటప్పుడు కారులో విశాలమైన స్థలం ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు కాళ్లు చాపుకోవడానికి లెగ్‌రూమ్ బాగుంటే ఎలాంటి అలసట ఉండదు. 2026 సంవత్సరంలో రూ. 12 లక్షల బడ్జెట్‌లో అద్భుతమైన లెగ్‌రూమ్ అందించే కొన్ని బెస్ట్ కార్ల గురించి మీకోసం...
1. మారుతి ఎస్-ప్రెస్సో
ఈ లిస్టులో తక్కువ ధరకే ఎక్కువ విశాలమైన స్థలం ఇస్తున్న కారు ఇదే. వెనుక సీట్లలో దాదాపు 900mm వరకు లెగ్‌రూమ్ లభిస్తుంది. దీని ఎత్తైన సీటింగ్ వల్ల కారులోకి ఎక్కడం, దిగడం చాలా ఈజీ. ముఖ్యంగా పెద్ద వయసు వారికీ ఈ కారు బాగా నచ్చుతుంది. సిటీలో తిరగడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని ధర రూ. 4.27 లక్షల నుండి మొదలవుతుంది.
2. టాటా పంచ్
సేఫ్టీకి మారుపేరైన ఈ మినీ ఎస్‌యూవీలో లెగ్ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. వెనుక సీట్లలో 870mm వరకు లెగ్‌రూమ్ ఉంటుంది. దీని టాల్-బాయ్ డిజైన్ వల్ల లోపల తల ఎత్తు సరిగ్గా సరిపోతుంది. పైగా 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ ఉండటంతో ఫ్యామిలీకి చాలా నమ్మకమైన సేఫెస్ట్ కారు ఇది. దీని ధర రూ. 5.70 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది.
3. మారుతి వాగన్ ఆర్
చిన్న కుటుంబాలలో ఎప్పటి నుంచో నమ్మకమైన పేరున్న కారు ఇది. వెనుక సీట్లలో 850mm లెగ్‌రూమ్ లభిస్తుంది. ఇందులో నలుగురు పెద్ద వాళ్ళు చాలా హాయిగా కూర్చోవచ్చు. తగినంత హెడ్‌రూమ్ ఉండటం వల్ల, రోజూ కారు వాడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ధర రూ. 5.84 లక్షల నుండి మొదలవుతుంది.
4. హోండా అమేజ్
సెడాన్ కార్లలో విశాలమైన స్థలాన్ని కోరుకునే వారికి అమేజ్ కార్ మంచి అప్షన్. దీనిలో ముగ్గురు ప్రయాణికులు వెనుక చాలా సౌకర్యంగా కూర్చోవచ్చు. వెనుక కూర్చునే వారి కోసం AC వెంట్లు ఇచ్చారు. దీని సస్పెన్షన్ సౌకర్యవంతంగా ఉండటం వల్ల లాంగ్ జర్నీలు చాలా హ్యాపీగా సాగిపోతాయి. దీని ధర రూ. 8.10 లక్షల నుండి ఉంటుంది.
ALSO READ : ఎలాన్ మస్క్ X యాప్‌లో కొత్త సర్వీస్..
5. హ్యుందాయ్ క్రెటా
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజులా పేరుపొందుతున్న కారు ఇది. ఐదుగురు పెద్దలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి ఈ కార్ బెస్ట్ ఛాయిస్. కుషన్ సపోర్ట్ ఉన్న వెనుక సీట్లు, మంచి షోల్డర్ రూమ్ ఉండటం వల్ల రోజు ప్రయాణాలు ఎంతో హాయిగా ఉంటాయి. దీని ధర రూ.10.79 లక్షల నుండి మొదలవుతుంది.
