స్కోడా ఇండియా సరికొత్త ఫీచర్లతో 'స్లావియా' సెడాన్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). 1.0 లీటర్ టీఎస్‌ఐ వేరియంట్‌లో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టారు. 1.5 లీటర్ మోడల్ 7-స్పీడ్ డీఎస్‌జీతో లభిస్తుంది. వెనుక సీట్లకు మసాజ్ ఫీచర్, 360-డిగ్రీ కెమెరా, జెమిని ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్‌లను అందించారు. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్‌గా వస్తున్నాయి.
