చిన్న కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్.. 10 వేల కోట్లతో SGF ఫండ్ 

చిన్న కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్.. 10 వేల కోట్లతో SGF ఫండ్ 

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగానికి కీలకమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈల) అభివృద్ధితో పాటు లాజిస్టిక్స్ రంగాన్ని సమూలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు భారీ నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ గ్రోత్ ఫండ్ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కోసం రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించింది.  దీంతోపాటు సరికొత్త ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాజిస్టిక్స్ అథారిటీ (ఐటీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

స్టార్టప్స్‎కూ సాయం.. 

సాధారణంగా ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు, అతిచిన్న (మైక్రో) సంస్థలకు వివిధ ఫండ్ల ద్వారా నిధులు అందుతున్నాయి. కానీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తరించాలని,  అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని  చూసే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు క్యాపిటల్  కొరత పెద్ద అడ్డంకిగా మారింది. ఈ లోటును పూడ్చేందుకే ప్రభుత్వం ఈ రూ.10 వేల కోట్ల ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది.  

మార్కెట్లో నిలదొక్కుకుని, వేగంగా ఎదిగే సత్తా ఉన్న ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ కంపెనీల్లో ప్రభుత్వం నేరుగా ఈక్విటీ  పెట్టుబడులు పెడుతుంది. అంటే ప్రభుత్వం కొంత వాటా పొందుతుంది. ఈ నిధులలో ఎక్కువ భాగం మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలకు అందుతాయి. 

ముఖ్యంగా టైర్-2, టైర్-3, చిన్న నగరాల్లోని ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లస్టర్లలో పనిచేసే కంపెనీలకు ఈ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉపయోగపడుతుంది.  కొత్త టెక్నాలజీని కొనడానికి,  ప్రొడక్షన్ కెపాసిటీని పెంచడానికి,  గ్లోబల్ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెయిన్లలో ఇండియా ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను చేర్చడానికి ఈ నిధులు సాయపడతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ఐటీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏతో రవాణాలో వేగం

దేశవ్యాప్తంగా వివిధ రవాణా మార్గాల మధ్య సమన్వయం సాధించేందుకు కేంద్రం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాజిస్టిక్స్ అథారిటీ (ఐటీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ)  పేరుతో ప్రత్యేక విభాగాన్ని  ఏర్పాటు చేయనుంది. ఇది రవాణాకు సంబంధిత రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రాజెక్టుల  పర్యవేక్షణ వంటి బాధ్యతలను చూస్తుంది. 

రోడ్లు, రైల్వేలు, విమానయానం, ఓడరేవులు, తీరప్రాంతం, అంతర్గత జలమార్గాలు, నగర రవాణాను అనుసంధానిస్తూ కనీసం 10 ఏళ్ల కాలపరిమితితో  ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేషనల్ లాజిస్టిక్స్  మాస్టర్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ సంస్థ రూపొందిస్తుంది. 

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రూ. 500 కోట్లు, అంతకంటే ఎక్కువ ఖర్చయ్యే ప్రతి భారీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రా ప్రాజెక్టుకు టెక్నికల్ అప్రైజల్ ఇస్తుంది. అంటే ఈ ప్రాజెక్టులు ఉపయోగమేనా కాదా అనేది నిర్ణయిస్తుంది.  జీఎస్టీ ఈ-వే బిల్లులు, ఫాస్టాగ్, వాహన్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి వ్యవస్థల డేటాతో 'నేషనల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ డేటా రిపోజిటరీ'ని తయారు చేస్తుంది.