పిల్లాడి మెడలో నాగుపాము.. ఊరంతా పరుగులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

పిల్లాడి మెడలో నాగుపాము.. ఊరంతా పరుగులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Terrifying Moment: పాము పేరెత్తితేనే జనాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, కంటికి కనిపించకుండా దూరంగా ఉరుకుతరు. కానీ ఆ నాగుపాముకి ఏమొచ్చిందో ఏమో గానీ, బీహార్‌లోని పాట్నా జిల్లా బుద్ధువాచక్ ఊర్లో పండుకున్న ఒక ఐదేళ్ల పొరగాడి మెడకి నెక్లేస్ లెక్క చుట్టుకుని హాయిగా కూర్చుంది.  బహదూర్‌పూర్ నుంచి వచ్చిన తండ్రి రామ్మూర్తి ఇంట్లో నిద్రపోతున్న కొడుకుని చూసి షాక్ అయ్యాడు. నాలుగడుగుల నాగుపాము పొరగాడి ఛాతీ మీద నుంచి మెల్లగా పాక్కుంటూ వచ్చి, మెడకి చుట్టుకుని, కరెక్ట్‌గా మూతి దగ్గర వీఐపీ సీటు దొరికినట్టు పడగవిప్పి నిలబడింది. ఆ సీన్ చూసి బాలుడి తల్లి అరిచిన అర్పులకి, ఊర్లోని జనమంతా ఒక్కసారిగా ఆ ఇంటికి పరుగెత్తుకుంటా వచ్చారు.

గంటసేపు సైలెంట్ మోడ్లో ఊరి జనం: 

గదిలోకి వచ్చిన జనం అక్కడ ఉన్న నాగుపాముని చూసి షాక్ అయ్యారు. పాముని బయటకి పంపేద్దామని చూడగా, నా జోలికొస్తే పొరగాడి పని గోవిందా చేస్తాను అన్నట్లుగా అది బుసలు కొడుతూ కనిపించింది. దాంతో ఊరోళ్లంతా చేతులు కట్టుకుని, దేవుడా.. నువ్వే కాపాడాలి తండ్రీ అంటూ గంటసేపు సైలెంట్‌గా దండాలు పెట్టుకుంటూ ఉండిపోయారు. ఇక్కడ అసలైన వింత ఏందంటే.. ఈ లోకంలో ఏం జరుగుతుందో నాకేం సంబంధం లేదన్నట్టు ఆ కుర్రాడు హాయిగా కుంభకర్ణుడి లెక్క నిద్రపోతున్నాడు. ఆ పిల్లాడు ఏమాత్రం కలగలకుండా సైలెంట్‌గా పండుకోవడమే ఆ పాముకి బోర్ కొట్టించి కామ్‌గా ఉండేలా చేసింది.

పిల్లాడు లేవగానే జారుకున్న తాచుపాము: 

గంట తర్వాత మెల్లగా నిద్రలేచిన ఆ బాలుడు.. చుట్టూ ఏదో జాతర లెక్క పోగైన జనాల్ని చూసి భయపడి ఏడుస్తూ తల్లి వైపు మెల్లగా వెళ్లిపోయాడు. పొరగాడు కదిలేసరికి ఆ నాగుపాము కూడా సరే భయ్యా.. నా పని అయిపోయింది, మళ్లీ కలుద్దాం! అన్నట్టు చాలా సైలెంట్‌గా మెడ నుంచి కిందకి జారి, ఇంటి బయటికి వెళ్లిపోయింది. పాము వెళ్లగానే ఆ తల్లి ఉరికిపోయి కొడుకుని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఊరోళ్లు కూడా అబ్బో.. ప్రాణాలు దక్కాయిరా బాబోయ్ అని ఊపిరి పీల్చుకున్నారు.

►ALSO READ | ఆమె మనిషి అనుకున్నావా..? లేక... నడిరోడ్డు మీద బైక్ పై... భార్యను ఈడ్చుకెళ్ళిన భర్త...

సోషల్ మీడియాలో రచ్చ: 

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఆలస్యం, క్షణాల్లో ఫుల్ వైరల్ అయిపోయింది. ఫ్రీ నాగుపాము నెక్లేస్ తొడుక్కున్న ఏకైక చిన్నోడు అని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కానీ, ఇట్లాంటి డేంజర్ పరిస్థితులు ఎదురైనప్పుడు మీలోని స్టంట్ మాస్టర్ ని నిద్రలేపి సొంత ప్రయోగాలు చేయకుండా.. సైలెంట్‌గా స్నేక్ రెస్క్యూ టీమ్‌కో లేకపోతే అటవీ శాఖోళ్లకో ఫోన్ చేయడం బెటర్ అని మరికొందరు చెబుతున్నారు.