మా ఆదాయం100 కోట్ల రూపాయలు: స్వయంగా ప్రకటించిన 576 మంది

మా ఆదాయం100 కోట్ల రూపాయలు: స్వయంగా ప్రకటించిన 576 మంది

దేశంలో ధనవంతుల జాబితా భారీగా పెరిగింది. వందల కోట్లు సంపాదిస్తున్న వారి సంఖ్య పైపైకి వెళుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం.. 100 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నట్లు ప్రకటించిన వారి సంఖ్య.. అక్షరాల 576 మంది. అవును.. గత ఐదు సంవత్సరాల్లో ఇది నాలుగు రెట్లు పెరిగింది. భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని పార్లమెంట్ లెక్కలు చెబుతున్నాయి.

2025-26సంవత్సరానికి గాను 576 మంది వ్యక్తులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌(ITR)లలో రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని చూపించారని, సోమవారం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి  పార్లమెంటుకు తెలిపారు. ఇది 2021-22 లో నమోదు అయిన రిపోరుర్టులో142 సంఖ్యతో పోలిస్తే నాలుగు రెట్లు వృద్ధిని నమోదు అయిందన్నారు. 2022-23 లో రూ. 100 కోట్లు ,అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తుల సంఖ్య 301గా ఉండగా, 2023-24 లో అది 284కి తగ్గి, 2024-25 సంవత్సరంలో 415కి పెరిగిందన్నారు.

►ALSO READ | ఆ విధంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు : సీఎం విజయ్ కు హైకోర్టు షాక్

ఆదాయం, సంపద కేంద్రీకరణ పెరగడం వల్ల ఆదాయ అసమానత, పెట్టుబడి, ఉపాధి కల్పన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై పడే ప్రభావం గురించి ప్రభుత్వం ఏమైనా అధ్యయనం చేసిందా అనే మరో ప్రశ్నకు సమాధానమిస్తూ..ఆదాయ, సంపద అసమానతలను తగ్గించడానికి, విస్తృత ప్రాతిపదికన ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వీటిలో ప్రగతిశీల ఆదాయపు పన్ను విధానం, ఆహారం, ఆరోగ్యం, విద్య, గృహనిర్మాణం, సామాజిక భద్రతపై వ్యయాన్ని పెంచడం వంటివి ఉన్నాయి," అని మంత్రి అన్నారు.