ఆ విధంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు : సీఎం విజయ్ కు హైకోర్టు షాక్

ఆ విధంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు : సీఎం విజయ్ కు హైకోర్టు షాక్

ఎన్నికల ప్రచారంలో భాగంగా కరూర్ రోడ్ షో తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పపట్టింది మద్రాస్ హైకోర్టు. ఉద్యోగ నియామకాలను రద్దు చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని.. ఆర్టికల్ 14, 16 ఉల్లంఘన కిందకు వస్తుందని.. ఈ చర్య వల్ల ఇతరులు కూడా ఇలాంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించింది.సీఎం విజయ్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

గతేడాది సెప్టెంబర్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కరూల్ జిల్లాలో టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది చనిపోయారు. విజయ్ ఆలస్యంగా రావడం, అనుమతించిన కెపాసిటీకంటే మించి జనం రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఆరోపించారు. అయితే పోలీసుల వైఫల్యం,  మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ కుట్ర చేయడం పన్నారని టీవీకే ఆరోపించింది. 

►ALSO READ | గాంధీ మార్గంతోనే ఉద్యమ విజయం సాధ్యమైంది: సోనమ్ వాంగ్ చుక్

ఇదిలా ఉండగా.. జూలై ప్రారంభంలో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 32 మంది బాధితుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ పత్రాలు అందజేశారు సీఎం విజయ్. మృతుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ పునరావాస చర్యలలో భాగంగా సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అయితే విజయ్ నిర్ణయంపై మధురైకి చెందిన లాయర్ తీరన్ తిరుమురుగన్‌తో పాటు ఇతరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. సోమవారం ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు సీఎం విజయ్ నిర్ణయం చట్టబద్దంగా లేదని నియామకాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో సీఎం విజయ్ ప్రభుత్వానికి న్యాయపరంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.  మరోవైపు ఈ కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది.