శాంతియుత నిరసనల ద్వారానే విజయం సాధించాం.. మార్పు తెచ్చింది రాళ్లు కాదు.. శాంతి మార్గం అంటూ సోనమ్ వాంగ్ చుక్ అన్నారు. గాంధేయ మార్గంలో ఉద్యమ విజయం సాధించామన్నారు. అందుకు కృతజ్ణతలు తెలిపేందుకు ఆస్పత్రినుంచి ముందుకు గాంధీ స్మృతివనం రాజ్ ఘాట్ వెళ్లానని సోనమ్ వాంగ్ చుక్ అన్నారు.
దీక్ష విరమణ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్ చుక్ సోమవారం ( జూలై 27) డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ తర్వాత ఆయన నేరుగా ఇంటికి వెళ్లకుండా భార్య గీతాంజలితో కలిసిరాజ్ ఘాట్ కు వెళ్లారు. అక్కడ మహాత్మాగాంధీజీకి నివాళులర్పించారు.
తనపై జాతిపిత గాంధీజీ ప్రభావం ఎంతో ఉందని, గాంధీజీ సిద్దాంతాల ప్రభావంపై విశ్వాసాన్ని చాటిచెప్పేందుకు మొదట రాజ్ ఘాట్ ను సందర్శించానని వాంగ్ చుక్ అన్నారు. ఆరేళ్లుగా లఢాఖ్ లో తన అనుచరులు గాంధేయ వాదాన్ని పాటిస్తున్నారని సోనమ్ అన్నారు. అయితే గాంధీజీ విధానం జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుందో లేదోనని మొదటి సందేహించామని అన్నారు. శాంతియుత నిరసనలు ఈనాటికీ ప్రభావం చూపుతున్నాయన్న నమ్మకాన్ని ఈ ఉద్యమం బలపర్చిందన్నారు సోనమ్.
►ALSO READ | CJP నిరసనకారులపై.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శలు
బాపు చూపిన శాంతి మార్గం ద్వారా తమ బాధలను, విజ్ఞప్తులను వినిపించాలని, ఒక పరిష్కారం తప్పక దొరుకుతుందని దేశ ప్రజలకు విజ్ణప్తి చేశారు వాంగ్ చుక్. అందుకు సమయం పట్టవచ్చు, కానీ అంతిమంగా విజయం సాధించవచ్చని స్పష్టమైందన్నారు.
వాంగుచుక్ నిరాహారదీక్ష..
నీట్ పేపర్ లీకులు , ఎగ్జామ్స్ సంస్కరణల డిమాండ్లపై వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు దేశవ్యాప్త మద్దతు లభించింది. దీంతో నిరసనలు కొనసాగి, చివరికి జూలై 26న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఎగ్జామ్ నిర్వహణ వ్యవస్థలో మార్పులు, శాంతియుత నిరసనకారులపై కేసుల ఎత్తివేయడంవంటి డిమాండ్లను నెరవేరుస్తామని ప్రభుత్వంహామీ లభించడంతో వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించారు.
