నీట్ పేపర్ లీక్ పై సీజేపీ నిరసనలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలకు సంబంధించిన వైరల్ వీడియాలో వాంతి వచ్చేలా ఉన్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. నిరసనకారులు అసభ్యతను , వికారాన్ని వ్యాప్తి చేశారంటూ ఆరోపించారు. ఇన్ స్టా గ్రామ్ లో పెట్టి ఓ పోస్టులో సీజేపీ నిరసనల వీడియోలను షేర్ చేశారు. నా జీవితంలో ఒకే చోట ఇంతటి వికృతత్వాన్ని ఎప్పుడూ చూడలేదు అని రనౌత్ అన్నారు. కాక్రోచెస్ మాట్లాడే విధానం, వాడుతున్న భాష... ప్రతి ఫ్రేమ్‌లోని ప్రతీదీ చాలా ఇబ్బందికరంగా, చాలా అసభ్యంగా ఉంది. ఛీ... వీళ్ళకి జన్మనిచ్చి పెంచుతున్నది ఎవరు?" అంటూ అసభ్య పదజాలంతో కంగనా రాయడం చర్చనీయాంశమైంది.
బీజేపీ ఎంపీ కంగానా రనౌత్ సీజేపీని లక్ష్యంగా చేసుకుని ఇలా రాశారు.."మిమ్మల్ని మీరు బొద్దింకలని పిలుచుకుంటారు, చూడటానికి, ప్రవర్తించడానికి కూడా అలాగే ఉంటారు. ఇందులో ఎలాంటి వైరుధ్యం గానీ, పొంతన లేకపోవడం గానీ లేదు, కేవలం మీ మురికి, చెత్త ,వికారానికి ప్రపంచాన్ని గురిచేయడమే." అంటూ రాశారు. డిజిటల్ డిటాక్స్ అవసరమని కంగనా రాసుకొచ్చారు.
►ALSO READ | నేను స్ట్రీట్ ఫైటర్‌ను.. ఏసీ రూమ్ కార్యకర్తను కాదు..ధర్మెంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు
