కబ్జాదారులే కోర్టుకెళ్తున్నారు... ఆక్రమణలపైనే హైడ్రా చర్యలు: హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్

 కబ్జాదారులే కోర్టుకెళ్తున్నారు... ఆక్రమణలపైనే హైడ్రా చర్యలు: హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్

 ఆక్రమణల మీదే హైడ్రా కొరడా రువ్విందని, చెరువులు, కుంటలను కాపాడిందని, అయితే తప్పు చేసిన కబ్జాకారులే ఇప్పుడు కోర్టులను ఆశ్రయిస్తున్నారని  సీఎం రేవంత్  మండిపడ్డారు.గతంలో  సోమేష్ కుమార్ పై 400 లకు పైగా కోర్టు ధిక్కరణ కేసులున్నాయని..ఆనాడు అవన్నీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రేవంత్. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారమన్నారు. ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవ్వరూ లాక్కోలేరని అన్నారు రేవంత్. న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామన్నారు.

 ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో తలెత్తిన కరువు పరిస్థితులను కేంద్రమంత్రికి వివరించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. బీజేపీ నాయకులు అత్యంత దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేయాలని చూశారని, కేసీఆర్ సర్కార్ ఏకంగా రూ. 8 వేల కోట్ల బకాయిలు పెట్టి ఆ బండను తమ ప్రభుత్వంపై మోపిందని ఆరోపించారు. అయినప్పటికీ తాము వెనకడుగు వేయకుండా, ఇకపై ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని స్పష్టం చేశారు.

►ALSO READ | ప్రధానిని కాపాడేందుకు..ప్రధాన్ ను తొలగించారు: అఖిలేష్ యాదవ్ సెటైర్లు

జన్ జీ ఉద్యమాన్ని అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. పేపర్ లీకేజీలకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల పరిధిలోని అధికారాలను గుంజుకోవాలని కేంద్రం చూస్తోందన్నారు. రాష్ట్రాల్లోని వర్శిటీల్లో పెత్తనం చేయాలని కేంద్రం చూస్తోందని..  పార్లమెంట్‌లో ఈ అన్ని అంశాలపై రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని  నిలదీస్తారని స్పష్టం చేశారు.