తొలి ప్లేయర్ గా వైభవ్ రికార్డ్.. నా కల నిజమైంది...ఇదంతా వారి వళ్లే: వైభవ్ సూర్యవంశీ

తొలి ప్లేయర్ గా వైభవ్ రికార్డ్.. నా కల నిజమైంది...ఇదంతా వారి వళ్లే: వైభవ్ సూర్యవంశీ

జింబాబ్వే గడ్డపై టీమిండియా  అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో గెలుపొంది, సిరీస్‌ను 3-0  తేడాతో వైట్‌వాష్ చేసింది. ఈ ఘన విజయంలో చిచ్చర పిడుగు   పదిహేనేళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 151 పరుగులు చేసిన సూర్యవంశీ, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తొలి టీ20లో అర్ధశతకంతో చెలరేగిన ఈ కుర్రాడు, చివరి మ్యాచ్‌లో ఏకంగా 81 పరుగులు చేసి తన తొలి అంతర్జాతీయ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు. దీంతో  ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

►ALSO READ |  కామన్వెల్త్ గేమ్స్‌ ఫైనల్స్‎కు ఇండియా స్విమ్మింగ్ మెన్స్ టీమ్

మ్యాచ్ అనంతరం సంతోషం వ్యక్తం చేస్తూ.. ఇది తనకు కల నిజమైన క్షణంలా ఉందని, జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వడమే తన ఏకైక వ్యూహమని అన్నాడు వైభవ్. చాలా బాగుంది. మేము హరారేకు వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు మా ప్రాక్టీస్ బాగా జరిగింది. నేను ఇక్కడే అండర్-19 ప్రపంచ కప్ కూడా ఆడాను, కాబట్టి కెప్టెన్, కోచ్‌లు, అందరూ నాకు మద్దతు ఇచ్చారు. - అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అతను అన్నాడు. 

జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు, సూర్యవంశీ  ఇదే వేదికపై ఈ ఏడాది ఫిబ్రవరిలో,అండర్-19 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో భారత్ తరపున ఆడాడు. సెమీఫైనల్‌లో 68 పరుగులు చేసి, ఆ తర్వాత ఫైనల్‌లో కూడా సంచలనాత్మక 175 పరుగులు సాధించాడు.