గ్లాస్గో: భారత పురుషుల 4x 200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే జట్టు తమ హీట్‌లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. దీనిద్వారా ఆదివారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్విమ్మింగ్ పతక ఆశలు సజీవంగా నిలిచాయి. తక్షణ్ శశికుమార్, అనీష్ సునీల్ కుమార్ గౌడ, ఆర్యన్ నెహ్రా, శ్రీహరి నటరాజ్‌తో కూడిన నలుగురి జట్టు హీట్ 2లో 7:39.48 నిమిషాల సమయంతో గమ్యాన్ని చేరుకుంది.
ఈ విభాగంలో స్విమ్మింగ్ దిగ్గజాలు ఆస్ట్రేలియా(7:08.66), ఇంగ్లాండ్ (7:18.13) దేశాల తర్వాత స్థానాల్లో నిలిచింది. కెనడా బరిలోకి దిగకపోవడంతో ఈ హీట్‌లో కేవలం నాలుగు జట్లు మాత్రమే పోటీ పడ్డాయి. దీంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారతదేశం, జెర్సీ సహా మొత్తం నాలుగు జట్లు ఫైనల్‌కు ప్రవేశించాయి. ఈ రేసులో ఆస్ట్రేలియా మొదటి నుంచి చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించగా, మూడో స్థానం కోసం భారత్, జెర్సీ మధ్య పోరు సాగింది.
