శ్రీలంకతో టెస్ట్ సిరీస్‎కు భారత జట్టు ప్రకటన: స్టార్ ప్లేయర్స్ బుమ్రా, జడ్డూ ఈజ్ బ్యాక్

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‎కు భారత జట్టు ప్రకటన: స్టార్ ప్లేయర్స్ బుమ్రా, జడ్డూ ఈజ్ బ్యాక్

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్ నేతృత్వంలో 15 మందితో కూడిన స్వ్కాడ్‏ను మంగళవారం (జులై 28) అనౌన్స్ చేసింది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‎గా ఎంపికయ్యాడు. 

గాయాలు, ఇతర కారణాలతో గత కొంతకాలంగా రెడ్ బాల్ ఫార్మాట్‎కు దూరమైన స్టార్ ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే, సాయి సుదర్శన్, బుమ్రాల లభ్యత బీసీసీఐ సీఓఈ ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తేనే ఈ ఇద్దరు బరిలోకి దిగుతారు.

ఇక, గతకొంత కాలంగా దేశవాళీ క్రికెట్‎లో నిలకడగా రాణిస్తోన్న ఆల్ రౌండర్ సరన్ష్ జైన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. కాగా, భారత్, శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2026, ఆగస్టు 15, 2026 నుంచి ఆగస్టు 27 వరకు జరగనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్ శ్రీలంక వేదికగా నిర్వహించబడుతోంది.

శ్రీలంకతో టెస్టుల కోసం భారత జట్టు:

శుభమన్ గిల్ (c), KL రాహుల్ (vc), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (wk), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (wk), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరన్ష్ జైన్

ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

మొదటి టెస్ట్
 ఆగస్టు 15 – 19
గాలే ఇంటర్నేషనల్ స్టేడియం

రెండవ టెస్ట్
ఆగస్టు 23 – 27
సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC), కొలంబో