విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా ..తుపాకులతో కాల్చాలని ఎవరు ఆదేశించారు:ప్రియాంకగాంధీ

విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా ..తుపాకులతో కాల్చాలని ఎవరు ఆదేశించారు:ప్రియాంకగాంధీ

యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్ సభలో వాడీ వేడీ చర్చ జరిగింది. బిల్లుపై చర్చలో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ.. పేపర్ లీకులు, విద్యార్థులపై పోలీసు చర్యపై  బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా..? విద్యార్థులపై చర్యలకు ప్రధాని మోదీ ఆదేశించారా.. హోమంత్రి అమిత్ షా ఆదేశించారా.. విద్యార్థులను కొట్టాలని ఆదేశించడం సిగ్గుచేటు అని ప్రియాంక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.దేశంలో152 పేపర్ లీకులు జరిగినా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదు..దేశం కోరుతోంది, సమాధానం చెప్పే దమ్ము కేంద్ర ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు ప్రియాంకా గాంధీ. 

విద్యకోసం కేంద్ర బడ్జెట్ లో కేటాయించిన నిధులన్నీ ఏమయ్యాయని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. కొందరు బడా వ్యాపారుల చేతిలోకి ప్రభుత్వం సొమ్ము వెళుతోందని ఆరోపించారు. పిల్లల భవిష్యత్తుకోసం తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలను కల్లలు చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, విద్యావ్యవస్థ విద్యార్థులకు భరోసా ఇవ్వలేకపోతోంది.. దేశంలో ఎగ్జామ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్ అయింది.  విద్యావ్యవస్థలో ప్రక్షాళన జరగాల్సిందేనని డిమాండ్ చేశారు ప్రియాంక గాంధీ. 

పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రియాంకాగాంధీ ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదని  అన్నారు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే.. తప్పు చేసి తలదించుకోవాల్సిన  చోట స్వాగతాలు చెప్పి కిరిటాలు పెడుతున్నారని విమర్శించారు.అమాయక విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న నిందితులను పట్టుకోకుండా, మంత్రులు రీల్స్ చేయాలని ప్రధాని ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు ప్రియాంక. 

ALSO READ : కావేరీ జలాల వివాదం.. మేకెదాటు ప్రాజెక్టుకు అనుమతులివ్వొద్దు..

కొత్త విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.  ప్రహ్లాద్ జోషి ఎలాంటి వాడో తెలుపుతూ బిల్కిస్ బానో పై జోషి ఆరోపణలను ఉదహరించారు ప్రియాంకగాంధీ.  గర్భవతిపై అత్యాచారం చేసిన నిందితులను ప్రహ్లాద్ జోషి సమర్థించారు. నిందితులకు బెయిల్ వస్తే  ప్రహ్లాద్ ఆనందించారు. కోట్లాది మహిళలకే ప్రభుత్వం ఏం సమాధానం చెబుతోంది.. అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థిస్తుందా ప్రభుత్వం అని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు.