న్యూఢిల్లీ: ఈ వారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుసగా మూడు నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. రెండో శనివారం, ఆదివారంతో పాటు వినాయక చవితి పండుగ సెలవులు కలిసి రావడమే ఇందుకు కారణం. బ్రాంచీల్లో అత్యవసర పనులున్న వారు ఇబ్బంది పడకుండా ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.
తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 3 రోజులే సెలవులున్నాయి. సెప్టెంబర్ 12 (రెండో శనివారం), సెప్టెంబర్ 13 (ఆదివారం), సెప్టెంబర్ 14 (వినాయక చవితి) సందర్భంగా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు హాలిడే.
ఒడిశా, గోవా రాష్ట్రాల్లో నాలుగు రోజులు సెలవులున్నాయి. సెప్టెంబర్ 12 (శనివారం) సెప్టెంబర్ 13 (ఆదివారం), సెప్టెంబర్ 14 (సోమవారం– వినాయక చవితి), సెప్టెంబర్ 15 (మంగళవారం– వినాయక చవితి రెండో రోజు) సందర్భంగా బ్యాంకులు మూతపడతాయి. ఈ సెలవు దినాల్లో బ్యాంక్ శాఖలు పనిచేయకపోయినా.. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి.
