గద్వాల జిల్లాలో డ్రగ్స్ సమాచారం ఇస్తే రూ.10వేలు గిఫ్ట్ : గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

గద్వాల జిల్లాలో డ్రగ్స్ సమాచారం ఇస్తే  రూ.10వేలు గిఫ్ట్ : గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలో డ్రగ్స్ అమ్ముతున్న, సాగు చేస్తున్న సమాచారాన్ని ఇస్తే వారికి రూ. 10 వేలు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ లో నషాముక్త భారత్ అభియాన్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాసంస్థల్లో  డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలీస్ ఎక్సైజ్ శాఖలు బహిరంగ ప్రదేశాలలో మద్యపానం తీసుకునే వారిపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని సూచించారు.