హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు సెప్టెంబర్ 14 మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. తొలి విడతలో మిగిలిన ఖాళీ సీట్లతో పాటు పెరిగిన సీట్లు ఈ కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను పరిశీలించి అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు సూచించారు.
సెప్టెంబర్ 15న సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. మేనేజ్‌మెంట్ కోటా కింద మొదటి విడత ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కేటాయింపును సెప్టెంబర్ 16న విడుదల చేయనున్నట్లు యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఆప్షన్ల నమోదు కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
