చక్కగా చదువు చెప్పండి : యాదాద్రి ఇన్చార్జ్ కలెక్టర్ ఏ భాస్కరరావు

 చక్కగా చదువు చెప్పండి : యాదాద్రి ఇన్చార్జ్ కలెక్టర్ ఏ భాస్కరరావు

యాదాద్రి, వెలుగు : స్టూడెంట్స్​కు చక్కగా చదువు చెప్పాలని టీచర్లను యాదాద్రి ఇన్​చార్జ్​ కలెక్టర్​ ఏ భాస్కరరావు ఆదేశించారు. శుక్రవారం అడ్డగూడూరులోని కేజీబీవీ, గురుకుల పాఠశాలలను ఆయన సందర్శించారు.  

ఈ సందర్భంగా కిచెన్​ను పరిశీలించి, కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. స్టూడెంట్స్​తో మాట్లాడుతూ వసతులపై ఆరా తీశారు. టీచర్లు చదువు చెబుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం టీచర్లతో మాట్లాడారు. చదువు చక్కగా చెప్పాలని, విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 

సెలవుపై కలెక్టర్​ అనురాగ్​ జయంతి
యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​ జయంతి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత పనులపై సెలవుపై వెళ్లిన ఆయన ఈ  నెల 28న తిరిగి  బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పటివరకూ అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావు ఇన్​చార్జ్​ కలెక్టర్​గా వ్యవహరిస్తారు.