ఖైరతాబాద్ బడా గణేశ్ ఆగమనం అదిరింది.. ఇవాళ ( సెప్టెంబర్ 12 ) నేత్ర మోక్షం తర్వాత పూర్తిగా దర్శనం..

ఖైరతాబాద్ బడా గణేశ్ ఆగమనం అదిరింది.. ఇవాళ ( సెప్టెంబర్ 12 ) నేత్ర మోక్షం తర్వాత పూర్తిగా దర్శనం..

పంజాగుట్ట, వెలుగు: ఖైరతాబాద్ మహాగణపతి ఆగమనం అదిరింది. సంప్రదాయ  పూజలతో పాటు   డప్పు చప్పుళ్ల మధ్య  బడా గణపతికి ఘన స్వాగతం పలికారు. ఈసారి స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నారు. ఆగమన పూజలకు ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ ​మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి, వేల సంఖ్యలో  భక్తులు తరలివచ్చారు. 

ఈ సందర్భంగా గణేశుడు పాక్షికంగా దర్శనమిచ్చారు. శనివారం శిల్పి రాజేంద్రన్​నేత్ర మోక్షం (కన్నులను దిద్దడం) నిర్వహించిన తర్వాత   పూర్తిస్థాయిలో దర్శనమివ్వనున్నాడు.  ఈ సందర్భంగా మండపం, పరిసర ప్రాంతాల్లో  ఖైరతాబాద్​ సీఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలను సైతం మోహరించనున్నట్లు తెలిపారు.