వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రా పరీక్ష

వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రా పరీక్ష

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రా.. వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీకి పరీక్ష పెట్టాడు. అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో ఈ ఇద్దరు శుక్రవారం కోట్లా స్టేడియంలో నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

ఈ సందర్భంగా బుమ్రా వేసిన తొలి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడగా వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాన్ని బాదడానికి ప్రయత్నించి మిస్సయ్యాడు. అదే లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేసిన తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందకు రాకముందే స్వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయి పక్కకు వెళ్లిపోవడంతో వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంటాడి ఫెయిలయ్యాడు. మూడోది పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయగా, దాన్ని అతి కష్టం మీద బయటకు నెట్టాడు.

నాలుగో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొంచెం బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేయడంతో వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేవలం టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగలిగాడు. నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మెరుగైన పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడి ఎలా ఉంటుందో వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బుమ్రా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపించాడు. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వేసిన ఐదో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా పంపాడు. అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ వైభవ్ ఇబ్బందిపడ్డాడు.

ఇక ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మూడు క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వేసిన వేగవంతమైన బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా సవాలు విసిరాయి. మొత్తానికి బుమ్రా రీ ఎంట్రీతో టీమిండియా శిబిరంలో ఉత్సాహం నెలకొంది.

మరిన్ని వార్తలు