కోల్బెల్ట్, వెలుగు: నేల మైలపడిందని, దళితులను అవమానించే రీతిలో బీఆర్ఎస్అధినేత కేసీఆర్ ఫామ్హౌజ్వద్ద పసుపునీళ్లతో శుద్ధి చేసిన ఘటనను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అను దళితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి బంధ ఎస్సీ సెల్ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా ఎస్సీ సెల్చైర్మన్ పైడిమల్ల నర్సింగ్నేతృత్వంలో లీడర్లు, కార్యకర్తలు శుక్రవారం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ప్లకార్డులతో అంబేద్కర్ విగ్రహాం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. పసుపునీళ్లతో శుద్ధి చేయడం ముమ్మాటికీ కుల వివక్షేనని, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి పొట్ట మధుకర్, వైస్చైర్మన్జుంజుపల్లి నర్సింగ్, నూనె నర్సయ్య, ఎ.నాగరాజు, కె.సతీశ్, జి.బానేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.
