ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయండి..సీఎంను కోరిన డీసీసీ నరేశ్జాదవ్

ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయండి..సీఎంను కోరిన డీసీసీ నరేశ్జాదవ్

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని, కుప్టీ ప్రాజెక్ట్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్​రెడ్డిని జిల్లా డీసీసీ ప్రెసిడెంట్​నరేశ్​జాదవ్​కోరారు. హైదరాబాద్​లోని అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం సీఎంను కలిసిన నరేశ్​జాదవ్​వినతిపత్రం అందజేశారు. 

ఇటీవల జిల్లాలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లా తరఫున చేసిన తీర్మానాన్ని ముఖ్యమంత్రికి సమర్పించారు.  సానుకూలంగా స్పందించిన సీఎం అభివృద్ధిపై హామీ ఇచ్చినట్లు నరేశ్​జాదవ్​తెలిపారు.