ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం పొలాల పండుగ సంబురంగా జరిగింది. పొలాల అమావాస్య సందర్భంగా రైతులు తమ ఎడ్లను రంగురంగుల దుస్తులు, బెలూన్లతో అలంకరించారు.
అనంతరం వీధుల్లో ఊరేగింపు నిర్వహించి, గ్రామదేవతల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఎడ్లకు పూజలు చేసి, నైవేధ్యం సమర్పించారు. వాటికి నైవేద్యం సమర్పించిన తర్వాత తాము ఉపవాసం వీడడం ఇక్కడి రైతుల ఆనవాయితీ.
వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
