ఆర్మూర్, వెలుగు: అర్హత లేకున్నా క్లినిక్ఏర్పాటు చేసి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ ను పోలీసులు అరెస్ట్‌చేశారు. నిజామాబాద్జిల్లా ఆర్మూర్‌లో సమీర్ రాయ్ అనే వ్యక్తి క్లినిక్ఏర్పాటు చేసి డాక్టర్అవతారమెత్తి రోగులకు ట్రీట్ మెంట్చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడి ప్రియాంక్ క్లినిక్‌కు ఓ వ్యక్తి వైద్యం కోసం వెళ్లగా సమీర్ రాయ్ వైద్యం చేశాడు. వైద్యం వికటించడంతో సదరు వ్యక్తి నిజామాబాద్‌లోని ఆస్పత్రిలో చేశాడు.
సమీర్రాయ్పై ఫిర్యాదుల నేపథ్యంలో డిప్యూటీ డీఎంహెచ్ వో రవీందర్ ఆదేశాల మేరకు గురువారం అతడిని అరెస్ట్ చేసి, క్లినిక్ సీజ్ చేసినట్లు ఆర్మూర్ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్‌తెలిపారు.
