నేడు (సెప్టెంబర్  11) జాతీయ మహిళా కమిషన్‌‌ వద్దకు ..బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు

నేడు (సెప్టెంబర్  11) జాతీయ మహిళా కమిషన్‌‌ వద్దకు ..బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
  • అసెంబ్లీ ఆవరణలో దాడి ఘటనపై ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు బీఆర్‌‌ఎస్ నేతలు గురువారం రాత్రికి ఢిల్లీ చేరుకున్నారు. బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవితో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్, పలువురు నేతలు ఉన్నారు.

శుక్రవారం జాతీయ మహిళా కమిషన్ చైర్‌‌పర్సన్‌‌తో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రతినిధులను కలిసి అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి, తమ హక్కులకు భంగం కలిగించిన తీరుపై ఫిర్యాదు చేయనున్నట్లు బీఆర్‌‌ఎస్ నేతలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.