మంచిర్యాలలో నేషనల్ లెవల్ ఫారెస్ట్ మారథాన్

మంచిర్యాలలో నేషనల్ లెవల్ ఫారెస్ట్ మారథాన్
  •     5, 10, 30 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహణకు అటవీ శాఖ ఏర్పాట్లు 

మంచిర్యాల, వెలుగు: ఎకో టూరిజం అభివృద్ధి, ఫిట్​నెస్​పై అవగాహన లక్ష్యంగా మంచిర్యాల అటవీశాఖ ఆధ్వర్యంలో అక్టోబర్​11న నేషనల్​లెవల్​మారథాన్‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన 'గ్రీన్‌‌‌‌‌‌‌‌సెక్యూర్ ఫౌండేషన్' సహకారంతో మంచిర్యాల శివారు ర్యాలీ ఫారెస్టులోని జంగిల్ సఫారీ ట్రాక్ పై నిర్వహించనున్నట్టు డీఎఫ్​వో రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. జిల్లా అటవీశాఖ మొదటిసారి నిర్వహిస్తున్న ఆల్ర్టా మారథాన్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు గురువారం మీడియాకు వెల్లడించారు. 

మారథాన్ నిర్వహణ కోసం గడ్​పూర్ సమీప అటవీ ప్రాంతంలో మూడు ప్రత్యేక ట్రాక్‌‌‌‌‌‌‌‌లను సిద్ధం చేశామని.. 5, 10, 30 కిలోమీటర్ల విభాగాల్లో మారథాన్​జరుగుతుందన్నారు. పాల్గొనే వారికి గైడ్ చేయడానికి, అత్యవసర వైద్య సహాయం కోసం ట్రాక్ పొడవునా అటవీ సిబ్బందిని నియమిస్తామన్నారు. మారథాన్​లో పాల్గొన్న వారి పేరిట మరుసటి రోజు బొక్కలగుట్ట గాంధారి వనం (అర్బన్ పార్క్)లో మొక్కలు నాటుతామని పేర్కొన్నారు. ఔత్సాహికులు www.gtrultra.com వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ లో​నిర్ణీత ఎంట్రీ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కోరారు. బ్రేక్​ఫాస్ట్​, టీ-షర్ట్, మెడల్, ప్రశంసాపత్రం అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8639337951 నంబర్​లో సంప్రదించాలని సూచించారు.