న్యూఢిల్లీ: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా అరుణ్ ధుమాల్ తిరిగి ఎన్నిక కానున్నాడు. ఈమేరకు అతను దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఏకే జోతి ఆమోదించారు. ఈనెల 18న ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో మిగతా పోస్ట్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. కౌన్సిల్ మెంబర్‌గా ఖైరుల్ మజుందార్ ఎన్నిక కూడా లాంఛనప్రాయమైంది.
ధుమాల్, మజుందార్ నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు జోతి ప్రకటించారు. పోటీలో ఇతర అభ్యర్థులు లేకపోవడంతో వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ధుమాల్ రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. బీసీసీఐ ఏజీఎమ్‌లో ధుమాల్, మజుందార్ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.
