జ్వరంతో వచ్చే ప్రతి రోగికీ డెంగ్యూ పరీక్షలు : వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

జ్వరంతో వచ్చే ప్రతి రోగికీ డెంగ్యూ పరీక్షలు : వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు : జ్వరంతో వచ్చే ప్రతి రోగికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్​సురభి డాక్టర్లకు సూచించారు. శుక్రవారంవనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. మందుల కొరత లేకుండా చూస్తూ గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు.  

శిథిలావస్థలో ఉన్న భవనానికి ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని, నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అనంతరం మల్కాపూర్ గ్రామంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి భూ రీ-సర్వే ప్రక్రియను పరిశీలించారు.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రోవర్లను ఉపయోగించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రైతుల సమక్షంలో పకడ్బందీగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.