గద్వాల, వెలుగు: ప్రేమ పెళ్లి ఎఫెక్ట్ తో గద్వాల మండల పరిధిలోని రేపల్లె గ్రామంలో గురువారం అబ్బాయి ఇంటిని కూల్చేసిన సంగతి తెలిసిందే. ఇంటిని కూల్చేసిన అమ్మాయి తరపు బంధువులపై కేసు నమోదు చేసినట్లు సీఐ టంగుటూరి శీను తెలిపారు. గద్వాల మండల పరిధిలోని రేపల్లె గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
బాధితుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆరు మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మిగతా వారిపై కూడా విచారణ చేపట్టి చర్యలు చేపడుతామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
