అచ్చంపేట, వెలుగు : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వి. రమేశ్‌బాబును ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు తేదీలతో మరణ ధ్రువపత్రాలు జారీ చేసిన ఘటనపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ శుక్రవారం సస్పెండ్ చేశారు.
విచారణలో భాగంగా రికార్డుల్లో అక్రమాలు, అధికార దుర్వినియోగం, విధుల పట్ల నిర్లక్ష్యం నిరూపితం కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు తెలిపారు.
