జోగులాంబ గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో..కరెంటు కోతలను నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు

జోగులాంబ గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో..కరెంటు కోతలను నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు

గద్వాల/ సూర్యాపేట/సిద్దిపేట రూరల్/తొగుట( అక్బర్‌‌‌‌‌‌‌‌పేట-భూంపల్లి)  వెలుగు:  జోగులాంబ గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ సమస్యలతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందడంతో పాటు 24 గంటల నాణ్యమైన కరెంటు అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతులు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లను ముట్టడించి రోడ్లపై రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. గద్వాల జిల్లా మల్దకల్, ధరూర్ మండల కేంద్రాల్లోని సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లను ముట్టడించి రహదారులపై బైఠాయించగా, సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టి ఏఈకి వినతిపత్రం సమర్పించారు. అక్బర్‌‌‌‌‌‌‌‌పేట-భూంపల్లి మండలంలో కూడవెల్లి వాగు బ్రిడ్జిపై జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. 

సూర్యాపేట జిల్లాలో ఎస్ఈ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆందోళన నిర్వహించి వినతిపత్రం అందజేశారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక మోటార్లు కాలిపోతున్నాయని, సకాలంలో యూరియా కూడా అందక తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.