కావేరీ జలాల విషయంతో తమిళనాడు, కర్ణాటక మరోసారి వివాదం రాజుకుంది. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన మేకెదాటు ప్రాజెక్టును కావేరీ జలాల ట్రిబ్యునల్ కు నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్నారని విజయ్ ఆరోపించారు. కావేరీ నదిపై మేకెదాటు ప్రాజెక్టును నిర్మాణానికి అనుమతులివ్వొద్దంటూ మంగళవారం(జూలై28) ్రపధాని మోదీకి లేఖ రాశారు.
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన మేకెదాటు ప్రాజెక్టును అనుమతులు ఇవ్వొద్దని తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అన్ని చట్టబద్దమైన పరిపాలన అనుమతులు నిలిపివేయాలని లేఖలో కోరారు. ఆ ప్రాజెక్టును కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ (CWDT) నిబంధనలు, సుప్రీంకోర్టు 2018 తీర్పుకు విరుద్ధంగా ఉందని విజయ్ వాదించారు.
మంగళవారుం(జూలై28) రాజ్యసభలో కావేరీ నదిపై ప్రాజెక్టుల నిర్మాణంపై జలశక్తి శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ.. కావేరీ నదిపై చేపట్టే నిర్మాణాలకు ముందు దిగువన ఉన్న రాష్ట్రాల అనుమతిని తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చెప్పలేదని అన్నారు. ఈ అంశంపై స్పందనగా ప్రధాని మోదీకి విజయ్ సుదీర్ఘ లేఖ రాశారు. కేంద్రం వివరణ చట్టబద్దంగా లేదని అన్నారు. అంతర్రాష్ట్ర నదుల వివాదాలపై న్యాయ సూత్రాలను విస్మరించిందని సీఎం విజయ్ విమర్శించారు.
►ALSO READ | ప్రధానిని కాపాడేందుకు..ప్రధాన్ ను తొలగించారు: అఖిలేష్ యాదవ్ సెటైర్లు
ఆల్మట్టి డ్యామ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు విజయ్. నదీ ప్రవాహాన్ని ప్రభావితం చేసే ఎగువ ప్రాజెక్టులను చేపట్టే ముందు దిగువ రాష్ట్రాల అనుమతిని అవసరమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని విజయ్ అన్నారు. మేకెడాటు ప్రాజెక్టు ప్రతిపాదనకు కూడా అదే సూత్రం వర్తిస్తుందని సీఎం విజయ్ వాదించారు.
అంతేకాదు.. 2018లో కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ వాదనలు సమర్థిస్తూ రాష్ట్రాలు తమ భూభాగంలోని నీటిని ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే వాడుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని సీఎం నొక్కి చెప్పారు.
ప్రధాని మోదీ జోక్యం చేసుకుని మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సీఎం విజయ్ లేఖలో కోరారు. సీడబ్ల్యూడీటీ, సుప్రీంకోర్టు తీర్పును పాటించేలా చర్యలు చేపట్టి తమిళనాడు రాష్ట్ర హక్కులను కాపాడాలని విజయ్ డిమాండ్ చేశారు.
The Text of the D.O. Letter dated 28.7.2026, addressed to the Hon'ble Prime Minister of India Thiru. Narendra Modi, from the Hon'ble Chief Minister of Tamil Nadu Thiru. C. Joseph Vijay, regarding Mekedatu Dam.#CMJosephVijay pic.twitter.com/HbdwQAM3nQ
— CMOTamilNadu (@CMOTamilnadu) July 28, 2026
