హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం: జలమయమైన రోడ్లు.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం: జలమయమైన రోడ్లు.. భారీగా ట్రాఫిక్ జామ్

 హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్ గచ్చిబౌలి,   కూకట్ పల్లి, కేపీహెచ్ బీ ,నిజాంపేట్,బాల్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ, అమీర్ పేట్ ,పంజాగుట్ట, ఖైరతాబాద్ ,బేగంగపేట, సికింద్రాబాద్,అల్వాల్ ,ఉప్పల్   పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. 

రాజేంద్రనగర్ అత్తాపూర్ శంషాబాద్. మైలార్ దేవ్ పల్లి. బండ్లగూడ జాగిర్  కిస్మత్ పూర్. హిమాయత్ సాగర్ హైదర్ షాకోట్.  నార్సింగి, మణికొండ పుప్పాలగూడ గండిపేట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల తోపాటు బోయిన్ పల్లి,మారేడుపల్లి, బేగంపేట్,రాంగోపాల్ పేట,బన్సీలాల్ పేట,సీతాఫల్ మండి తోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది.

రోడ్లన్నీ జలమయం కావడంతో పలో ప్రధాన రోడ్లపై  భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లో మరో రెండు గంటల పాటు వర్షం పడుతుందని  అటు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేసింది. 

మరో వైపు  బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రెండు  రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీగా, దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.