హిందూ పురాణాల ప్రకారం గురు పౌర్ణమి చాలా ప్రత్యేక మైనది. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు జులై 29న వచ్చింది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజున 12 రాశుల వారు కొన్ని పరిహారాలు పాటిస్తే.. విద్య.. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయని చెబుతున్నారు. ఏ రాశి వారు ఎలాంటి పరిహారం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
హిందూ సంప్రదాయం ప్రకారం.. జపాలకు.. దానాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. 2026 జులై 29న గురు పూర్ణిమ సందర్భంగా గురువులను పూజంచాలి. గురువులను భగవంతుడి స్వరూపంగా భావిస్తారు. గురు పౌర్ణమిని ఆషాఢ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. . జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గురు పౌర్ణమి రోజున మీ రాశిని బట్టి గురువులకు బహుమతులు ఇస్తే ఉత్తమ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.
మేషరాశి : ఈ రాశికి అధిపతి కుజుడు.. గురు పూర్ణిమ రోజున గురువుగారికి ఎరుపు రంగు దుస్తులు దానం చేయాలి. గులాబీ .. మందార పూలతో వినాయకుడిని పూజించాలి. పేదలకు .. పిల్లలకు దానిమ్మ పండ్లు.. ఎరుపు రంగు స్వీట్లను పంచిపెట్టాలి. ఇలా చేయడం వలన చదువు విషయంలో ఎలాంటి ఆటంకాలు కలగవని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: ఈ రాశికి శక్రుడు అధిపతి.. ఈ రాశి వారు గురు పౌర్ణమి రోజున ( జులై 29) తెల్లని దుస్తులతో గురువుగారిని సత్కరించాలి. పరమేశ్వరునికి పాలు, పెరుగు, ఆవునెయ్యితో అభిషేకం చేయాలి. స్వామిని తెల్లని పూలతో పూజించి.. పాలతో తయారు చేసిన పదార్దాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి : ఈ రాశికి బుధుడు అధిపతి.. 2026 జులై 29న గురు పౌర్ణమి సందర్భంగా గురువుగారికి.. బట్టలు పెట్టి స్వయంపాకం ఇవ్వాలి. .శుభ్రమణ్యేశ్వరస్వామిని పూజించి.. హల్వా.. పసుపు రంగు స్వీట్లను నైవేద్యం సమర్పించి పేదలకు.. పాఠశాల విద్యార్థులకు పంచిపెట్టాలి. ఇలా చేయడం వలన జీవితంలో అన్ని రకాల ఇబ్బందులు తొలగుతాయి.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి.. ఈ రాశి వారు గురు పౌర్ణమి రోజున గురువులకు వెండి వస్తువులు దానం చేయాలి. ఈ రాశి వారు పగలంతా ఉపవాసం ఉండి.. చంద్రోదయం తరువాత...శివాలయంలో స్వామిని దర్శించుకోవాలి. ముత్తైదువులకు కాని.. మహిళా గురువులకు కాని అలంకరణ సామాగ్రి( పసుపు.. కుంకుమ.. గంధం.. గాజులు.. కాటుక మొదలైనవి) ఇవ్వాలి.ఇలా చేయడం వలన ఇబ్బందులు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
సింహ రాశి: ఈ రాశికి సూర్యుడు అధిపతి.. గురువులకు గురు పౌర్ణమి రోజున ఎరుపు రంగు మిఠాయిలు, ఎరుపు రంగు దుస్తులు ఇవ్వాలి. పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు.. పెన్నులు పంచిపెట్టాలి. అనాథలకు అన్నదానం చేయాలి. ఇలా చేయడం వలన అన్ని విధాలుగా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
కన్య రాశి: ఈ రాశికి కూడా బుధుడే అధిపతి.. ఈ రాశి వారు గురువులకు గురు పౌర్ణమి రోజున ఆకుపచ్చని వస్త్రాలు.. పండ్లు.. దానం చేయాలి. పాద ప్రక్షాళన చేయాలి ( నీటితో కాళ్లు కడగాలి). అమ్మవారిని దర్శించి.. దేవాలయంలో దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. పేదలకు పాలు, పెరుగు దానం చేయడం వలన ఈ రాశి వారు ఇప్పటి వరకు పడిన ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
తుల రాశి : ఈ రాశికి శుక్రుడు అధిపతి.. లక్ష్మీనారాయణులను పూజించాలి. గురువును వెంకటేశ్వరస్వామిగా భావించి.. తెల్లని వస్త్రాలు సమర్పించాలి. తరువాత పసుపు రంగు పదార్దాలు.. పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలాచేయడం వలన అన్ని రంగాల్లో ఎనలేని విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి: ఈ రాశికి కుజుడు అధిపతి.. ఈ రాశి వారు శివాలయంలో ఆవుపాలతో అభిషేకం చేయాలి. గురువుకు దక్షిణ .. తాంబూలం ఇచ్చి సత్కరించాలి. ఎరుపు రంగు వస్త్రాలను గురువుకు కాని.. దేవాలయంలో బ్రాహ్మణునికి కాని ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేయడం వలన జీవితంలో తరచూవచ్చే సమస్యలకు పరిష్కారం లభిస్తుదని పండితులు చెబుతున్నారు.
ధనస్సు రాశి : ఈ రాశికి గురుడు అధిపతి.. గురు పూర్ణిమ రోజున ఇష్ట దైవాన్ని.. కుల దైవాన్ని పసుపు రంగు పూలతో పూజించాలి. వెంకటేశ్వరస్వామిని.. విష్ణుసంబంధ ఆలయాలను సందర్శించి లడ్డూలను స్వామివారికి సమర్పించాలి. గురువుగారికి పసుపురంగు వస్త్రాలు సమర్పించాలి. ఇలా చేయడం వలన ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.
మకర రాశి: ఈ రాశికి శని దేవుడు అధిపతి.. గురు పౌర్ణమి రోజున గురువు గారిని నీలం లేదా నలుపు రంగు వస్తువులు దానం చేయాలి. శివాలయంలో శని భగవానుడికి నువ్వులనూనెతో అభిషేకం చేయాలి. గురువుగారికి పాదాభివందనం చేసి భోజనంతో సత్కరించాలి. ఇలా చేయడం వలన అన్ని విధాలా మంచి జరుగుతుంది.
కుంభ రాశి: ఈ రాశికి కూడే శని దేవుడే అధిపతి. ఈ రాశి వారు ముదురు రంగు వస్త్రాలు.. శని భగవానుడికి సమర్పించాలి. గురువుగారికి నిత్యం ఉపయోగపడే వస్తువులు( చెప్పులు.. గొడుకు..వస్త్రాలు.. బియ్యం) దానం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మీన రాశి: ఈ రాశికి గురుడు అధిపతి.. ఈ రాశి వారు గురువుకు పసుపురంగు వస్తువులు దానం చేయాలి. గోమాతకు గ్రాసం తినిపించాలి. పేదలకు అన్నదానం చేయాలి. దేవాలయ దర్శనం చేయాలి. శివునికి బిల్వదళాలతో పూజించి.. పులిహార నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన జాతక దోషాలు తొలగి అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఎప్పుడో చదువుకున్నాం కదా.. ఇప్పుడు గురువు గారి దగ్గరకు వెళ్లాలంటే కష్టం.. అసలు వారు ఉన్నారో లేరో కూడా చాలామందికి తెలియదు. అలాంటి వారు పైన తెలిపిన పరిహారాలను మీ కార్యలయంలో యజమానికి గాని.. లేదా దేవాలయంలో వినాయకుడికి గాని సమర్పించాలి. శక్తి కొలది బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇచ్చి గురు పౌర్ణమి రోజున ఆశీర్వాదం తీసుకుంటే అంతామంచే జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
