పార్లమెంట్ లో జెన్ Z భాష... ఈ పదాలకు అర్థం తెలుసా..?

పార్లమెంట్ లో జెన్ Z భాష... ఈ పదాలకు అర్థం తెలుసా..?

సీజేపీ ఆందోళనల వల్ల దేశవ్యాప్తంగా ప్రధానంగా జెన్ జీ యువతపై జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో ఎన్డీయే ఎంపీలు సైతం జెన్ జీ భాషలో మాట్లాడారు. మంగళవారం లోక్‌‌‌‌‌‌‌‌సభలో చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు జెన్ జీకి ప్రత్యేకమైన పదాలను తమ ప్రసంగాల్లో వినియోగించారు. 

శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ.. 

  • ప్రతిపక్షాలు ‘ఎంఐఏ(మిస్సింగ్ ఇన్ యాక్షన్)’, 
  • ‘ఫోమో(ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్)’, ‘
  • డెలూలు(డెల్యూషన్; భ్రమ)’తో బాధపడుతున్నందునే ప్రధాని నివాసం ముందు నిరసన చేపట్టాయన్నారు. 

బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ కూడా 

  • ‘మోదీ క్లాక్డ్ ఇట్’ అంటూ జెన్-జీ పదజాలాన్ని వాడారు. 
  • ‘‘కాంగ్రెస్ విధానపరమైన శూన్యతను సృష్టించినచోట, మోదీ దానిని పూడ్చి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు(మోదీ క్లాక్డ్ ఇట్)’. ప్రతిపక్షాలు చేసింది కేవలం రాజకీయ అవకాశవాదం మాత్రమే" అని అన్నారు. 

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కూడా 

  • ప్రతిపక్షాలపై ‘జెన్-జీ’  పదబంధాన్ని ఉపయోగించారు. 
  • యువత తమతోనే ఉన్నారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని, దీనికంటే పెద్ద ‘డెలులూ’ మరొకటి లేదన్నారు.