గిరి ప్రదక్షిణ ఎఫెక్ట్ .. ట్రాఫిక్ వలయంలో విశాఖ.. గంటల తరబడి రోడ్లపైనే వాహనదారులు

 గిరి ప్రదక్షిణ ఎఫెక్ట్ .. ట్రాఫిక్ వలయంలో విశాఖ.. గంటల తరబడి రోడ్లపైనే వాహనదారులు

భక్తిశ్రద్ధలతో సాగే విశాఖ గిరి ప్రదక్షిణ వేళ.. నగరంలో ట్రాఫిక్ కష్టాలు తారాస్థాయికి చేరాయి. భారీగా తరలివచ్చిన భక్తులతో విశాఖ ప్రధాన మార్గాలన్నీ కిక్కిరిసిపోయి, ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.

సత్యం జంక్షన్ నుంచి మద్దిలపాలెం వరకు వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు కాలినడకన గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్న భక్తులు, ఇటు ఆ మార్గంలో వెళ్లాల్సిన వాహనదారులు భారీ రద్దీతో నానా అవస్థలు పడ్డారు. అడుగు ముందుకు వేయలేని పరిస్థితుల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

►ALSO READ | తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీలో స్టూడెంట్స్ కు ఫుడ్ పాయిజన్

మరోవైపు, మధురవాడ వైపు వెళ్లే వాహనాలను సైతం పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సుమారు మూడున్నర గంటలుగా వాహనాలను ఎందుకు అనుమతించడం లేదనే దానిపై స్పష్టత లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ.. ప్రత్యామ్నాయ మార్గాలు, రాకపోకలపై సరైన సమాచారం లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.