తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీలో స్టూడెంట్స్ కు ఫుడ్ పాయిజన్

తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీలో స్టూడెంట్స్ కు ఫుడ్ పాయిజన్

తిరుపతి నగరంలో కలకలం. తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలో స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ బారినపడ్డారు. 25 మంది స్టూడెంట్స్ వరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. హాస్టల్ లో ఉన్న స్టూడెంట్స్ కు సిమ్స్ లోని సెంట్రల్ క్యాంటీన్ నుంచి ఆహారం పంపిణీ జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన ఫుడ్ తిన్న స్టూడెంట్స్.. వాంతులు, విరేచనాలతో అనారోగ్యం బారిన పడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. స్టూడెంట్స్ అందర్నీ స్విమ్స్, టీటీడీ సెంట్రల్ ఆస్పత్రులకు తరలించారు. 

2026, జూలై 28వ తేదీ ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 25 మంది స్టూడెంట్స్ ఆస్పత్రులకు వచ్చారని.. అక్కడి సిబ్బంది చెప్పారు. అందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయని.. ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు చెప్పారు చికిత్స చేసిన డాక్టర్లు. 

ఆయుర్వేద మెడికల్ స్టూడెంట్స్ కు అందించే ఆహారం నాణ్యత లోపంగా ఉండటం వల్లే ఇలా జరిగిందని.. ఫుడ్ బాగుండటం లేదని స్టూడెంట్స్ అంటున్నారు. ఈ విషయం బయటకు రావటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఫుడ్ పాయిజన్ బారిన పడిన స్టూడెంట్స్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విచారణ చేపట్టారు. ఫుడ్ తయారు అవుతున్న స్విమ్స్ సెంట్రల్ కిచెన్ లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. సెంట్రల్ కిచెన్ లో నాణ్యత, శుభ్రతను పరిశీలిస్తున్నారు. స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ బారిన పడిన విషయం తెలిసిన వెంటనే.. పేరంట్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారి పిల్లల ఆరోగ్యంపై ఫోన్లు చేస్తుండటంతో.. అధికారులు టెన్షన్ పడుతున్నారు.