హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. అవాస కో-లివింగ్ హాస్టల్ భవనం పైనుంచి దూకి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన 23 ఏళ్ల యశ్వంత్, గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను మాదాపూర్‌లోని అవాస కో-లివింగ్ హాస్టల్‌లో రూమ్ నంబర్ 206లో ఉంటున్నాడు. కేవలం 10 రోజుల క్రితమే యశ్వంత్ ఈ హాస్టల్‌లో చేరాడు.
ఉదయం తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పిన యశ్వంత్, రక్త పరీక్ష (బ్లడ్ చెకప్) కూడా చేయించుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
