గుడ్ న్యూస్.. టీబీ అంతానికి కొత్త వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయ్.. కోట్లాదిమంది ప్రాణాలకు రక్షణ!

గుడ్ న్యూస్.. టీబీ అంతానికి కొత్త వ్యాక్సిన్లు  వచ్చేస్తున్నాయ్.. కోట్లాదిమంది ప్రాణాలకు రక్షణ!

గుడ్ న్యూస్..క్షయ వ్యాధి(TB)అంతానికి కొత్త వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయి.2029 నాటికి కొత్త టీబీ వ్యాక్సిన్లు మార్కెట్లోకి  రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న BCG వ్యాక్సిన్ ప్రధానంగా శిశువులకు మాత్రమే టీబీ నుంచి కాపాడగలదు.అయితే రాబోయే కొత్త వ్యాక్సిన్లు  అన్ని వయసుల వారికి ముఖ్యంగా యువత, పెద్దలలో ఊపిరితిత్తులకు టీబీ సోకకుండా నివారిస్తుందని ఈ వ్యాక్సిన్ కనిపెట్టిన పరిశోధకులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్లతో  ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం గల దేశాలలో బిలియన్ల కొద్ది ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చనుంది వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న స్విట్జర్లాండుకు చెందిన వ్యాక్సిన్ అలయన్స్ సంస్థ గావి (Gavi, the Vaccine Alliance) వెల్లడించింది. 

గావి ది వ్యాక్సిన్ అలయన్స్ ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం, 2029 నుంచి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్న కొత్త క్షయ (టీబీ) వ్యాక్సిన్‌లు 2030–2050 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 73 లక్షల మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. తక్కువ ఆదాయం గల దేశాలకు ఇవి 135 బిలియన్ డాలర్ల వరకు ఆర్థిక ప్రయోజనాలు అందించగలవని చెబుతోంది. 

టీబీకి కారణమయ్యే మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 1.07 కోట్ల కేసులు, 12 లక్షల మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక BCG టీకా శిశువుల్లో తీవ్రమైన టీబీని నిరోధించినా, దాని రక్షణ కాలక్రమేణా తగ్గుతుంది.

గావి సంస్థ గురించి.. 

జెనీవాకు చెందిన గావి ది వ్యాక్సిన్ అలయన్స్ సంస్థ  2000 నుంచి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో వ్యాక్సిన్లు అభివృద్ది చేస్తోంది. WHO, UNICEF, ప్రపంచ బ్యాంకు, దాత ప్రభుత్వాలు, వ్యాక్సిన్ పరిశ్రమ, గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ఇప్పటివరకు 120 కోట్లకు పైగా పిల్లలకు టీకాలు అందించింది. 

►ALSO READ | జ్యోతిష్యం : కన్యారాశిలోకి సూర్యుడు.. ఐదు రాశుల వారి ఇళ్లల్లో కనకవర్షం.. అదృష్టం వెల్లివిరుస్తుంది..!

కొత్త టీబీ వ్యాక్సిన్‌లు ముఖ్యంగా కౌమారదశ, పెద్దల్లో ఊపిరితిత్తుల టీబీని అంతమొందించే లక్ష్యంగా పనిచేస్తాయి.  తగినంత, సరసమైన, నిరంతర సరఫరా, విస్తృత వ్యాక్సినేషన్‌కు మద్దతు, అలాగే పోటీ,భౌగోళిక వైవిధ్యంతో కూడిన కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి దివగా గావి సంస్థలు అడుగులు వేస్తోంది.