తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం ( జులై 27 ) రాత్రి గ్రాండ్ వరల్డ్ సమీపంలో చిరుత సంచరించడంతో భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు అరగంటపాటు పిట్టగోడపై కూర్చుందని చెబుతున్నారు. గత రెండు నెలలుగా ఇదే ప్రాంతంలో చిరుత తిరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు అధికారులు.
గత రెండు నెలల్లో ఇదే ప్రాంతంలో చిరుత కనిపించడం ఐదోసారి అని అంటున్నారు అధికారులు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేపట్టారు.
చిరుతను అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు అధికారులు. ఆ ప్రాంతంలో ఫ్లెక్స్ బ్యానర్లను ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో నివాసితులలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు అధికారులు.
