IND vs ZIM: డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పు.. అభిషేక్ స్థానంలో సంజూ?

IND vs ZIM: డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పు.. అభిషేక్ స్థానంలో సంజూ?

IND vs ZIM: భారత్–జింబాబ్వే మధ్య చెన్నైలో జరగనున్న‘డూ ఆర్ డై’ మ్యాచ్‌కు ముందు టీమిండియా తుది జట్టుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్‌కు ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. సూపర్‌–8లో భారత్ ఆడబోయే ఈ చివరి మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. సెమీఫైనల్ కి అర్హత సాధించాలంటే జట్టు మేనేజ్‌మెంట్ ఈ మ్యాచ్‌లో రిస్క్ తీసుకోకుండా సేఫ్ ఆప్షన్ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో అభిషేక్ శర్మ టోర్నీలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం.. పెద్ద టోర్నీల్లో కేవలం ‘ఇంటెంట్’ సరిపోదని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ సాధారణంగా స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్‌ను స్లోగా సెట్ చేసుకోవడం, స్ట్రైక్ రొటేట్ చేయడం, మిడిల్ ఓవర్లలో పరుగులు తీయడం చాలా కీలకం. ఈ పరిస్థితుల్లో సంజూ శాంసన్ అనుభవం టీమిండియాకు ఎంతో ఉపయోగపడుతుందని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఈ టోర్నీలో సంజూకు ఎక్కువ అవకాశాలు రాకపోయినా, అతడు కొన్ని బాల్స్ లోనే మ్యాచ్ దిశను మార్చగల ప్లేయర్. అవసరమైతే ఇన్నింగ్స్‌ను నిలబెట్టడం, అవకాశం దొరికినప్పుడు వేగం పెంచడంలో అతడికి అనుభవం ఉంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన చేజ్‌లలో ప్రశాంతత జట్టుకు ప్లస్ పాయింట్‌గా మారుతుంది.

►ALSO READ | SL vs NZ: టాస్ గెలిచిన శ్రీలంక.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్

జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్‌లో భారీ షాట్ల కంటే స్థిరమైన బ్యాటింగ్ కే ప్రాధాన్యం ఇవ్వొచ్చని అంచనా. భారత్ బ్యాటింగ్ చేస్తే పరిస్థితిని బట్టి తన ఆటను మార్చుకునే సామర్థ్యం సంజూ శాంసన్ కి ఉంది. చేజ్ చేస్తే, మిడిల్ ఓవర్లలో స్పిన్‌పై అతడి పట్టు సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం ఫామ్ మాత్రమే కాదు, జట్టు సమతుల్యతకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. నాకౌట్‌ లాంటి మ్యాచులలో అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవాల్సి ఉంటుంది. ఐపీఎల్‌, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లు ఆడిన అనుభవం శాంసన్ కి ఉంది. భారత జట్టుకి గెలుపే కాదు నెట్ రన్ రేట్ కూడా కీలకం కానుంది. ఒక బలమైన బ్యాటింగ్ ప్రదర్శనే సెమీఫైనల్ దిశను నిర్ణయిస్తుంది. అభిషేక్ శర్మను పక్కన పెట్టడం కఠిన నిర్ణయం కాకపోవచ్చు.. కానీ ఇది పూర్తిగా వ్యూహాత్మక మార్పుగా భావించాలి.. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు ఇదే పెద్ద అవకాశంగా చెప్పాలి..