Team India: జింబాబ్వేతో మ్యాచ్‌కి టీమిండియాలో 3 మార్పులు పక్కా!

Team India: జింబాబ్వేతో మ్యాచ్‌కి  టీమిండియాలో 3 మార్పులు పక్కా!

Team India: జింబాబ్వేతో జరిగే కీలక మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 26వ తేదీన చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. అయితే ఇప్పటి వరకు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ జోడీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో.. టీమ్ మేనేజ్‌మెంట్ టాప్ ఆర్డర్‌లో భారీ మార్పులు చేసేందుకు  సన్నాహాలు చేస్తుంది. అంతేకాదు, ప్లేయింగ్ ఎలెవెన్‌లో సుమారు మూడు మార్పులు చేసే అవకాశం ఉంది.  

రింకూ సింగ్ ఔట్ – సంజూ శాంసన్ ఇన్
రింకూ సింగ్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో జట్టును విడిచి పెట్టి గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రికి వెళ్లాడు. దీంతో అతడు జింబాబ్వేతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు దాదాపుగా లేనట్లే.. అంతేకాదు, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తర్వాత కూడా రింకు స్థానం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితిలో సంజూను జట్టులోకి తీసుకోవడంతో టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మరింత బలపడుతుంది. నమీబియాతో మ్యాచ్‌లో సంజూ కేవలం 8 బంతుల్లోనే 22 పరుగులు చేసి తన దూకుడు ప్రదర్శించాడు. 

వాషింగ్టన్ సుందర్ అవుట్– అక్షర్ పటేల్ ఇన్
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడం పెద్ద చర్చకు దారి తీసింది. వ్యూహాత్మకంగా వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చినా అది భారత్‌కు పెద్దగా కలిసిరాలేదు. సుందర్ వికెట్లు తీయకపోగా, బ్యాటింగ్‌లో కూడా విఫలమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి రావాల్సిన అవసరం ఏర్పడింది.  చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో అతడు నాలుగు ఓవర్లు ఖచ్చితంగా వేసే అవకాశం ఉంది. అంతేకాదు, బ్యాటింగ్‌ చేసే సామర్థ్యం అక్షర్ కి ఉంది.

►ALSO READ | PAK vs ENG: ఇంగ్లాండ్ ఘన విజయం.. సెమీస్ రేస్ పాకిస్తాన్కి కష్టమే?

ఓపెనర్ గా సంజూ–3వ స్థానంలో ఇషాన్ 
భారత్‌ పవర్‌ప్లేలో రాణించేలా టీం మేనేజ్మెంట్ వ్యూహాత్మక మార్పులు చేస్తుంది. సంజూ శాంసన్ రైట్‌హ్యాండ్ బ్యాటర్ కావడంతో ప్రత్యర్థి కెప్టెన్ ఆఫ్ స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించకుండా అడ్డుకోగలడు.. అలాగే స్పిన్నర్లపై భారీ షాట్లు ఆడటంలో అతడు దిట్టా. ఈ మార్పుతో ఇషాన్ కిషన్ నంబర్-3లో బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలా చేస్తే మిగతా బ్యాటింగ్ లైనప్ పూర్తిగా మారిపోతుంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్‌ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం టాప్ ఆర్డర్ కాంబినేషన్, ఆల్‌రౌండర్ల ఎంపికలో ఈ మార్పులు భారత్‌కు కీలకంగా మారే అవకాశం ఉంది.