న్యూఢిల్లీ: క్లీన్ ఎనర్జీ సెక్టార్‌లో ఇండియా కొత్త మైలురాయిని అందుకుంది. సోలార్, విండ్, హైడ్రో, నూక్లియర్ వంటి నాన్ ఫాసిల్ ఎనర్జీ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్ కెపాసిటీ 300.50 గిగావాట్ల (జీడబ్ల్యూ) కు చేరింది. దేశ మొత్తం విద్యుత్ సామర్థ్యం (552 గిగావాట్ల) లో దీని వాటా 54 శాతానికి పైగా ఉంది. 2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ (సోలార్, విండ్, నూక్లియర్ వంటివి) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ 300 గిగావాట్లలో సోలార్ పవర్ (164.59), విండ్ పవర్ (58.14), హైడ్రో పవర్ (57.24), బయో పవర్ (11.75), నూక్లియర్ పవర్ (8.78) ఉన్నాయి. 2014లో కేవలం 2.8 గిగావాట్లుగా ఉన్న సోలార్ పవర్ కెపాసిటీ ఇప్పుడు 165 గిగావాట్లకు పెరిగింది. 2025–-26లో రికార్డు స్థాయిలో 55.29 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని కొత్తగా చేరింది. పీఎల్‌ఐ ఆమోదం పొందిన సోలార్ మాడ్యూళ్ల తయారీ కెపాసిటీ 200 గిగావాట్లను దాటింది.
