చిన్న కార్ల అమ్మకాలు భేష్‌‌‌‌: మారుతీ చైర్మన్ ఆర్‌‌‌‌సీ భార్గవ

చిన్న కార్ల అమ్మకాలు భేష్‌‌‌‌: మారుతీ చైర్మన్ ఆర్‌‌‌‌సీ భార్గవ

న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన జీఎస్‌‌టీ సంస్కరణలతో  భారత కార్ల పరిశ్రమ దూసుకుపోతుందని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్‌‌‌‌సీ భార్గవ తెలిపారు.  2030–-31 నాటికి అమ్మకాల సైజ్‌‌ 61 లక్షల నుంచి 63 లక్షల యూనిట్లకు పెరుగుతుందని, ముఖ్యంగా చిన్న కార్ల  మార్కెట్ వేగంగా  వృద్ధి చెందుతుందని వివరించారు. అమెరికా–-ఇరాన్ యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్‌‌గా ఉందని తెలిపారు. 

కాగా, మారుతీ సుజుకీ  2025–-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 24.22 లక్షల వాహనాలను విక్రయించింది. రూ. 1.83 లక్షల కోట్ల రాబడితో రూ. 14,445.4 కోట్ల ఆల్-టైమ్ హై నికర లాభాన్ని సాధించింది. జీఎస్‌‌టీ రేట్ల తగ్గింపు తర్వాత చిన్న కార్ల విక్రయాలు ఈ ఏడాది మొదటి క్వార్టర్‌‌‌‌ (ఏప్రిల్‌‌–జూన్‌‌) లో 35శాతం పెరిగాయి. 

కంపెనీ మొత్తం అమ్మకాలు 38శాతం పుంజుకున్నాయి. కంపెనీ  నెట్ జీరో టార్గెట్‌‌ను చేరుకోవడంలో  భాగంగా 4 బయోగ్యాస్ ప్రొడక్షన్‌‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం  తొలివిడతలో  రూ. 561 కోట్ల ఖర్చు చేయనుంది.