కోటక్‌‌ లో హోమ్‌‌ లోన్ వడ్డీ రేటు ఫిక్స్‌‌... హైబ్రిడ్ హోమ్ లోన్ స్కీమ్‌‌ లాంచ్‌‌..

కోటక్‌‌ లో హోమ్‌‌ లోన్ వడ్డీ రేటు ఫిక్స్‌‌... హైబ్రిడ్ హోమ్ లోన్ స్కీమ్‌‌ లాంచ్‌‌..

న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌లో  హోమ్‌‌ లోన్‌‌ తీసుకునేవారు, ఇప్పటికే  తీసుకున్నవారు  తమ  వడ్డీ రేటును గరిష్టంగా 65 నెలల వరకు  లాక్ చేసుకోవచ్చు. ఈ టైమ్‌‌లో ఆర్‌‌‌‌బీఐ రెపో రేటు పెంచినా, వీరి వడ్డీలో మార్పు ఉండదు.  ఇందుకోసం సంస్థ  'హైబ్రిడ్ హోమ్ లోన్' అనే కొత్త  స్కీమ్‌‌ను  ఆదివారం ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు తమ హోమ్ లోన్ వడ్డీ రేటును ప్రారంభంలో ఏకంగా 65 నెలల (5 ఏళ్లకు పైగా) వరకు ఫిక్స్  చేసుకోవచ్చు. 

కస్టమర్లు 39, 52 లేదా 65 నెలల ఫిక్స్డ్ రేట్ వ్యవధిని ఎంచుకోవచ్చు.  ప్రస్తుతం కోటక్ బ్యాంక్ గృహ రుణ వడ్డీ రేట్లు 7.6శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఎంచుకున్న వ్యవధి ముగిసిన తర్వాత లోన్ ఆటోమేటిక్‌‌గా రెపో రేటుకు అనుగుణంగా  'ఫ్లోటింగ్ రేట్' మోడ్‌‌లోకి మారుతుంది. ఆర్‌‌బీఐ వడ్డీ రేట్లు పెరిగే సమయాల్లో రూ.1 కోటి హోమ్ లోన్‌‌పై వినియోగదారులు రూ. 3.46 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని బ్యాంక్ పేర్కొంది. 

ఈ ఏడాది  జూన్ 30 నాటికి కోటక్ బ్యాంక్ మోర్టగేజ్ లోన్‌‌ బుక్ విలువ రూ.1,50,903 కోట్లుగా ఉంది. శాలరీడ్‌‌, సెల్ఫ్ ఎంప్లాయిడ్ బారోవర్లకు ఈ హైబ్రిడ్ హోమ్‌‌ లోన్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్న వారు ఈ స్కీమ్‌‌ను ఎంచుకోవాలనుకుంటే కొంత ఫీజు చెల్లించాలి.