ఎమ్మెల్యే కూతురిని పెళ్లాడిన నిత్య పెళ్లికొడుకు..అప్పటికే 25 పెళ్లిళ్లు అయ్యాయని ఎమ్మెల్యే ఆరోపణ

ఎమ్మెల్యే కూతురిని పెళ్లాడిన నిత్య పెళ్లికొడుకు..అప్పటికే 25 పెళ్లిళ్లు అయ్యాయని ఎమ్మెల్యే ఆరోపణ
  • దొంగల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యూపీ ఎమ్మెల్యే

ఓ నిత్య పెండ్లికొడుకు ఏకంగా యూపీ ఎమ్మెల్యేనే మోసం చేశాడు. ప్రముఖ రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారినని చెప్పి నమ్మించి ఎమ్మెల్యే కూతురును పెండ్లి చేసుకుండు. రెండేండ్ల తర్వాత అల్లుడు మోసగాడని, 25 పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలిసి ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లక్నో: పాతిక మంది మహిళలను పెళ్లాడిన ఓ నిత్య పెండ్లికొడుకు ఏకంగా ఓ ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించాడు. ఆయన కూతురుకు సూటయ్యే ఎలిజిబుల్ బ్యాచిలర్ నంటూ నమ్మించి పెండ్లి చేసుకున్నాడు. 

రెండున్నరేండ్ల తర్వాత అల్లుడి అసలు స్వరూపం బయటపడడంతో ఆ ఎమ్మెల్యే లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌‌‌‌‌‌‌‌ తివారీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. మిశ్రిఖ్‌‌‌‌‌‌‌‌లోని చంద్రావల్‌‌‌‌‌‌‌‌కు చెందిన అనూజ్‌‌‌‌‌‌‌‌ త్రివేది కుమారుడు ప్రఖర్‌‌‌‌‌‌‌‌ త్రివేదితో తన కూతురు ప్రగ్యాకు 2024లో పెళ్లి జరిగింది. 

పెళ్లి సమయంలో అనూజ్‌‌‌‌‌‌‌‌ త్రివేది తనను తాను ముంబైకి చెందిన ప్రముఖ రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ వ్యాపారినని పరిచయం చేసుకున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసులు, గత చరిత్రను దాచిపెట్టాడని పేర్కొన్నారు. పెళ్లయిన రెండున్నరేళ్ల తర్వాత  సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా సహా ఇతర మార్గాల ద్వారా ప్రఖర్‌‌‌‌‌‌‌‌ త్రివేది గురించి తమ కుటుంబానికి తెలిసిందన్నారు. 

మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో నకిలీ గుర్తింపులతో మహిళలను పరిచయం చేసుకుని, వారిని మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ప్రఖర్‌‌‌‌‌‌‌‌పై ఆరోపణలు చేశారు. దాదాపు 25 పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తన కూతురిని ఇంటికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ కేసులో అనూజ్‌‌‌‌‌‌‌‌ త్రివేది, అతడి కుమారుడు 
ప్రఖర్‌‌‌‌‌‌‌‌ త్రివేదిని పోలీసులు అరెస్టు చేశారు.