జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారంలోని రేగళ్లబాపు అనే వ్యక్తి ఇంట్లో షార్ట్సర్క్యూట్జరిగి మరో రెండు ఇండ్లకు నిప్పంటుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. బాపు ఇంట్లోని ఫ్రిడ్జిలో ఆదివారం మధ్యాహ్నం షార్ట్సర్క్యూట్జరిగి ఇంట్లోని ఫర్నీచర్, రెండు తులాల బంగారం కాలిపోయింది.
మంటలు ప్రక్కనున్న దేవయ్య, రాజబాపు ఇండ్లకు కూడా వ్యాపించడంతో వారి ఇండ్లలోని ఫర్నీచర్ కాలిపోయింది. ప్రమాద సమయంలో వారంతా పొలం పనులకు వెళ్లారు. ఒక్కొక్కరికి సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం తమను అదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
